Home

»

Latest News

నా కొడుకేం ఉగ్రవాది కాదు: అల్లు అరవింద్ కామెంట్స్కి యశ్ తల్లి కౌంటర్.!

Aug 31, 2026 4:28PM

"నా కొడుకేం ఉగ్రవాది కాదు. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా తన కష్టాన్ని నమ్ముకుని పైకొచ్చినోడు". ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌ తల్లి పుష్ప. యశ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' సినిమా విడుదలయ్యాక ఎలాంటి ట్రోలింగ్, విమర్శలు వచ్చాయో తెలిసిందే. అయితే తాజాగా ఈ విమర్శలపై యశ్ తల్లి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా "KGFకి ముందు యశ్ ఎవరు?" అంటూ గతంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు.

"వాడు ధనిక కుటుంబంలో పుట్టలేదు. కష్టపడి ఈ స్థాయికి వస్తే, వాడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా 'కేజీయఫ్'కి ముందు యశ్ ఎవరు? అనే మాటలపై స్పందిస్తూ.. 'కేజీయఫ్' కంటే ముందే యశ్‌కు వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అతనేం టెర్రరిస్ట్ కాదు. 'కేజీయఫ్'కి ముందు యశ్ ఎవరు? అని అనాల్సిన అవసరం ఏంటి?. అందరి హీరోల్లా యశ్ ధనిక కుటుంబంలో పుట్టలేదు. రాత్రికి రాత్రే ఈ విజయం రాలేదు, ఎన్నో ఏళ్ల కష్టానికి 'కేజీయఫ్' ఫలితమని ఒక తల్లిగా గర్వంగా చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఇవి కౌంటర్ లా ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఒక తల్లిగా కొడుకుపై విమర్శలు వచ్చినప్పుడు బాధగా కలగడం సహజమే. ఈ క్రమంలోనే ఆమె 'టాక్సిక్' ట్రోల్స్ పై మండిపడ్డారు. అంతవరకు బాగానే ఉంది కానీ, గతంలో ఎప్పుడో అల్లు అరవింద్ వేరే ఉద్దేశంతో చేసిన కామెంట్స్ ని.. ఇప్పుడు 'టాక్సిక్'కి ముడిపెడుతూ ఆమె విమర్శించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 'కేజీయఫ్'కి యశ్ తెలుగు ప్రేక్షకులకు తెలీదు. అయినప్పటికీ ఆ సినిమా తెలుగునాట ఘన విజయాన్ని సాధించింది. అదే విషయాన్ని అల్లు అరవింద్ ప్రస్తావిస్తూ.. హీరో కంటే కంటెంట్ ముఖ్యమని అన్నారు. ఆ ఓల్డ్ వీడియో క్లిప్ ను చూసి.. యశ్ తల్లి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు.

 

 

 

[Toxic Movie, Controversy, Yash Mother Pushpa, Allu Aravind Comments, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com