Home

»

Latest News

'ప్రేమ' కి క్యాన్సర్ అంటూ ప్రచారం.. 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్స్

Aug 31, 2026 4:02PM

 

'చెప్పనా, చెప్పనా చిన్న మాట'.. 'సొగసు చూడ హాయిహాయిలే'...'కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి'.. ఈ సాంగ్స్ వినిపిస్తున్నంత కాలం 'ప్రేమ' తెలుగు ప్రేక్షకుల మనస్సులో నుంచి చెరిగిపోవడం అసాధ్యం. 90 వ దశకంలో తెలుగు, కన్నడ భాషల్లో సత్తా చాటిన ప్రేమకి  ప్రాణాంతక క్యాన్సర్ సోకిందని, విదేశాల్లో చికిత్స తీసుకుంటుందంటూ  గతంలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడం కలకలం రేపింది. 


ఆ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మాట్లాడుతు నాకు క్యాన్సర్ అనే మాటలు   కేవలం పుకార్లు మాత్రమే. న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్న సమయంలో కొందరు కావాలనే నా ఆరోగ్యం గురించి ఇలాంటి అబద్ధపు వార్తలు సృష్టించారు. దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆ వదంతులు చూసి  మొదట్లో మానసిక కుంగుబాటుకు (డిప్రెషన్‌) గురయ్యాను.సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, గౌతమి వంటి నటీమణులు క్యాన్సర్‌ను ఎదురించి విజయం సాధించారని, కానీ తన విషయంలో మాత్రం కాన్సర్ అనేది  సృష్టించిన వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు.

 

Also read:  అసలు రహస్యం ఇదేనా!

ఇదే ఇంటర్వ్యూ లో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. 2006లో జీవన్ అప్పచ్చుని వివాహం చేసుకున్న నేను, వ్యక్తిగత మనస్పర్థల కారణంగా కొన్నేళ్ల క్రితం చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విడిపోయాను. మంచి వ్యక్తి దొరికితే 70 ఏళ్ల వయసులోనైనా మళ్ళీ వివాహం చేసుకుంటాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి తప్ప ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోవద్దని  యువతకి పిలుపునిచ్చింది.

 

 

 

[ Prema, cancer, Rumars, second Marraige, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com