`ఎఫ్ 3` కూడా ఆ హిట్ లిస్ట్ లో చేరుతుందా!
on May 26, 2022
స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు - రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. బాక్సాఫీస్ హాట్ ఫేవరేట్ కాంబినేషన్. `ఆర్య` (2004), `భద్ర` (2005), `బొమ్మరిల్లు` (2006), `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011), `ఎవడు` (2014), `నేను లోకల్` (2017), `దువ్వాడ జగన్నాథమ్` (2017), `ఎంసీఏ` (2017), `హలో గురూ ప్రేమ కోసమే` (2018), `ఎఫ్ 2` (2019), `మహర్షి` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020), `రౌడీ బాయ్స్` (2022).. ఇలా ఈ ఇద్దరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. మ్యూజికల్ గా మెప్పించిన ఈ సినిమాల్లో సింహభాగం బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలిచాయి.
కట్ చేస్తే.. వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తోంది. అదే.. `ఎఫ్ 3`. `ఎఫ్ 2` ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా తెరకెక్కిన `ఎఫ్ 3`.. వేసవి కానుకగా మే 27న రిలీజ్ కాబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో రాజు - డీఎస్పీ కాంబోలో వచ్చిన `ఆర్య`, `భద్ర`, `మహర్షి` సినిమాలు వేర్వేరు సంవత్సరాల్లో మే నెలలో విడుదలై మంచి విజయం సాధించాయి. మరి.. ఆ హిట్ లిస్ట్ లో `ఎఫ్ 3` కూడా చేరుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, `ఎఫ్ 3`లో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.
Also Read