పాన్ ఇండియా స్టార్స్ ని దాటి టాప్ లో నిలిచిన విజయ్
on May 26, 2022
ఆర్మాక్స్ మీడియా తాజాగా ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టుని విడుదల చేసింది. పాన్ ఇండియా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే విజయ్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఆర్మాక్స్ మీడియా ఇటీవల ఏప్రిల్ నెలకి గాను వివిధ సినీ పరిశ్రమల లిస్టు ప్రకటించగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళ్ లో విజయ్, హిందీలో అక్షయ్ కుమార్ టాప్ లో నిలిచారు. ఇక తాజాగా పాన్ ఇండియా రేంజ్ లో లిస్టు ప్రకటించగా మొదటి స్థానంలో విజయ్, రెండో స్థానంలో తారక్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో 3.ప్రభాస్, 4.అల్లు అర్జున్, 5.అక్షయ్ కుమార్, 6.అజిత్ కుమార్, 7.యశ్, 8.రామ్ చరణ్, 9.సూర్య, 10.మహేష్ బాబు ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేసిన హీరోలను వెనక్కి నెట్టి విజయ్ టాప్ పొజిషన్ లో నిలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఇటీవల 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల దుమ్ము దులిపింది. పైగా ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదల కాగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీ, తమిళ్, తెలుగు ఇలా మూడు వెర్షన్స్ టాప్-10 లో నిలవడం విశేషం. 'ఆర్ఆర్ఆర్'తో తారక్ నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్ లో తారక్ నటనకు అందరూ ఫిదా అయ్యారు.
ఇక పాన్ ఇండియా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లో సమంత టాప్ పొజిషన్ దక్కించుకుంది. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' సిరీస్ తో హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత.. 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా మావ' సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాతి స్థానాల్లో 2.అలియా భట్, 3.నయనతార, 4.కాజల్ అగర్వాల్, 5.దీపికా పడుకోణె, 6.రష్మిక మందన్న, 7.అనుష్క శెట్టి, 8.కత్రినా కైఫ్, 9.కీర్తి సురేష్, 10.పూజ హెగ్డే ఉన్నారు.