Home

»

Latest News

`లారీ డ్రైవ‌ర్` త‌రువాత `అఖండ‌`తో మ‌ళ్ళీ సెట్ అయ్యేనా?

Dec 1, 2021 2:28PM

న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ తాజా చిత్రం `అఖండ‌` రేపు (డిసెంబ‌ర్ 2) థియేట‌ర్స్ లోకి రాబోతోంది. రెండు విభిన్న పాత్ర‌ల్లో బాల‌య్య న‌టించిన ఈ సినిమాని బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించారు. `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత బాల‌య్య - బోయ‌పాటి కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డం.. ప్ర‌చార చిత్రాలు కూడా యూట్యూబ్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో `అఖండ‌`పై స్కై హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. డిసెంబ‌ర్ నెల‌లో బాల‌య్య సినిమా రావ‌డం ఇదే తొలిసారి కాదు. బాల‌న‌టుడిగా న‌టించిన రెండో చిత్రం `రామ్ - ర‌హీమ్` (1974)తో మొద‌లైన బాల‌య్య డిసెంబ‌ర్ జ‌ర్నీ.. ఆపై `క‌థానాయ‌కుడు` (1984), `ప‌ట్టాభిషేకం` (1985), `ర‌క్తాభిషేకం` (1988), `లారీ డ్రైవ‌ర్` (1990) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో స‌క్సెస్ ఫుల్ గా సాగింది. వీటిలో `లారీ డ్రైవ‌ర్` ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే, `లారీ డ్రైవ‌ర్` త‌రువాత డిసెంబ‌ర్ నెల‌లో వ‌చ్చిన బాల‌య్య చిత్రాలు నిరాశ‌ను మిగిల్చాయ‌నే చెప్పాలి. `అశ్వ‌మేథం` (1992), `టాప్ హీరో` (1994), `విజ‌యేంద్ర వ‌ర్మ‌` (2004), `రూల‌ర్` (2019).. ఇలా ఇటీవ‌ల కాలంలో ప‌రాజ‌యాలే ఉన్నాయి ఈ నెల‌లో. ఈ నేప‌థ్యంలో.. భారీ అంచ‌నాల న‌డుమ వ‌స్తున్న `అఖండ‌`.. `లారీ డ్రైవ‌ర్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి డిసెంబ‌ర్ నెల ప‌రంగా బాల‌య్య‌ని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకువ‌స్తుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com