
కొంత మంది హీరోయిన్స్ అంతే.. దేవలోకం నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చిన అందగత్తెల్లా అభిమానులు, ప్రేక్షకులని నిద్రకి దూరం చేస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో శ్రీనిధి శెట్టి ఒకరు. కెజిఎఫ్ సిరీస్, హిట్ 3 తర్వాత ఇప్పడు అక్టోబర్ 9 న వెంకటేష్ తో కలిసి 'ఆదర్శ కుటుంబం’ తో సందడి చేయడానికి వస్తుంది.
సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో హీరోయిన్స్ కి విశేష ప్రాధాన్యత ఇస్తుంటాడు. తను చేసే చిలిపి అల్లరి అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లోకి నేరుగా వెళ్తుంది. దీంతో ఆ హీరోయిన్ 'ఆరా' నుంచి బయటకి రావడం అంత తేలికైన పని కాదు. పూర్తిగా సరెండర్ అవుతాం. అందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయి. అందుకే, త్రివిక్రమ్ మ్యాజిక్ శ్రీనిధి కెరీర్‌ని కొత్త మలుపు తిప్పుతుందని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ.. నిజంగా జరిగిన క్రైమ్ స్టోరీ!
.webp)
ఏది ఏమైనా తన నటనతో మెప్పించి సినిమా హిట్ అయితే కనుక తెలుగులో వరుస అవకాశాలు రావడం ఖాయం. అభిమానులు అయితే ఖాయం కాదు, బొమ్మ పడని, శ్రీనిధి ఎంత బిజీ అవుతుందో చూపిస్తాం అంటున్నారు. మరి వాళ్ళ ఆశలకి అనుగుణంగా శ్రీనిధికి ఆదర్శ కుటుంబం సక్సెస్ ని ఇవ్వాలని కోరుకుందాం.
[Will Adarsha Kutumbam Bring Offers For Srinidhi Shetty, Srinidhi Shetty About Aadarsha kutumbam, Srinidhi Shetty, Aadarsha Kutumbam, KGF Srinidhi Shetty, Venkatesh,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]





