Home

»

Latest News

కొవిడ్‌తో బాధ‌ప‌డుతున్న క‌మ‌ల్.. 'బిగ్ బాస్ 5'కు కొత్త హోస్ట్‌!

Nov 24, 2021 4:46PM

 

కొవిడ్ 19తో బాధ‌ప‌డుతున్న లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. దీంతో రెండు వారాల పాటు ఆయ‌న‌ బిగ్ బాస్ 5 త‌మిళ్ వీకెండ్ ఎపిసోడ్స్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ వారం, వ‌చ్చేవారం వీకెంక్ ఎపిసోడ్స్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప‌లువురు యాక్ట‌ర్ల‌తో నిర్వాహ‌కులు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

కోలీవుడ్‌లో ప్ర‌చారంలో ఉన్న‌దాని ప్ర‌కారం క‌మ‌ల్ కుమార్తె, గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్ శ్రుతి హాస‌న్ ఈ రెండు వారాల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ది. మ‌రో బ‌జ్ ప్ర‌కారం విజ‌య్ సేతుప‌తి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. శింబు హీరోగా న‌టించిన మానాడు మూవీ రేపు రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా వీకెండ్ బిగ్ బాస్ సెట్స్‌పై అత‌ను ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌నున్నాడ‌ని తెలుస్తోంది. 

ఈ మ‌ధ్య‌లో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్‌, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, న‌టులు నాజ‌ర్‌, ప్ర‌భు, విక్ర‌మ్ ప్ర‌భు, ద‌ర్శ‌కుడు ఎస్పీ ముత్తురామ‌న్ త‌దిత‌రులు క‌మ‌ల్ హాస‌న్‌కు ఫోన్లు చేసి, ఆయ‌న యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి: కమల్‌ హాసన్‌ కు కరోనా పాజిటివ్!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com