Home

»

Latest News

లక్కీ ఛాన్స్: భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో వామికా గబ్బి.. అశ్వత్థామగా రానా దగ్గుబాటి.!

Aug 11, 2026 2:28PM

'హనుమాన్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, దాని సీక్వెల్ 'జై హనుమాన్'తో అంతకుమించిన సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

ఇప్పుడు ఈ చిత్రంలో ఒక క్రేజీ హీరోయిన్ జాయిన్ అవ్వబోతోందనే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు, టాలెంటెడ్ బ్యూటీ వామికా గబ్బి. రీసెంట్ గా 'డిసి' (DC) సినిమా సక్సెస్‌తో మంచి ఫామ్ లో ఉన్న ఈ భామను, 'జై హనుమాన్'లో ఒక కీ రోల్ కోసం చిత్ర యూనిట్ సంప్రదించినట్లు లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న 'జై హనుమాన్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వామికా లాంటి పర్ఫార్మర్ ఈ సినిమాలో ఉంటే, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 'భలే మంచి రోజు',  'గూఢచారి-2' తర్వాత వామికాకు ఇది మూడవ తెలుగు ప్రాజెక్ట్ అవుతుంది.

ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ కూడా వినబడుతోంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో 'అశ్వత్థామ' పాత్రలో కనిపించబోతున్నారనే చర్చ కూడా నడుస్తోంది. టి-సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

 

 

Wamiqa Gabbi, Jai Hanuman, Prasanth Varma, Rana Daggubati, Rishab Shetty

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com