Home

»

Latest News

హుష్ కాకి: ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు, వైరల్ అవుతున్న వీడియో 

Aug 11, 2026 2:40PM

 

ఈ దశాబ్దంలో ఇండియా వ్యాప్తంగా ఏ నటుడు అందుకోలేని స్టార్ డమ్ ప్రకాష్ రాజ్ అందుకున్నాడు. బహుశా ఇక అలాంటి నటుడు రాలేడేమో. కళకి సంబంధించి ఎన్ని రకాల క్యారెక్టర్స్ పుట్టాయో వాటన్నిటితోను ప్రకాష్ రాజ్ చెడుగుడు ఆడేసాడు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 


 ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతు 'కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి నా పేరుని   తొలగించారు.బెంగళూరు నగరంలోనే  పుట్టి పెరిగాను. పాఠశాల విద్య, కళాశాల విద్యను పూర్తి చేసుకుని, రంగుల ప్రపంచంలోకి రాకముందు రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాను. అటువంటి నాకు ఇప్పుడు స్వంత ఊరిలోనే ఓటు హక్కు లేకపోవడం  విడ్డూరంగా ఉంది.'ఇదో మంచి జోక్ కదూ?'. బెంగళూరు నగర పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించిన తర్వాత ఓటు హక్కు కోల్పోయిన దాదాపు 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. ఇప్పుడు నా ఓటు హక్కును తిరిగి పొందడానికి 'క్యా క్యా కాగజ్ దిఖానా పడేగా' (ఏ ఏ కాగితాలు చూపించాల్సి వస్తుందో) . 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ వీడియోలో  ప్రస్తావించారు. 

Also read: చిక్కుల్లో విక్రమ్: కోతిని ఆ విధంగా చేయడంతో తీవ్రమైన నేరంగా పరిగణింపు 

Prakash Raj, Begnlaore, Tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com