Home

»

Latest News

వినాయక్ మాస్ శకం ముగిసినట్లేనా? టాలీవుడ్‌లో షాకింగ్ నిజాలు

Aug 6, 2026 3:18PM

 

ఒక సినిమా హిట్ అని చెప్పుకోవడానికి ఎన్ని ఊర మాస్ పదాలని అభిమానుల నోటి నుంచి వింటామో అలాంటి  అన్ని రకాల హిట్స్ ని చూసేసిన దర్శకుడు వివి వినాయక్(VV Vinayak).మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' ఆది'తో దర్శకుడిగా ఆరంగ్రేటమ్ చేసి  'మాస్' అనే అసలు సిసలు  పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వినాయక్ దర్శకత్వ శైలికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వినాయక్ నుంచి సినిమా ప్రకటన వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు పైగా అవుతోంది. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఒకటే చర్చ వినాయక్ ఇక సినిమాలు తీయరా? ఆయన దర్శకత్వ ప్రయాణానికి ముగింపు పడినట్లేనా? అనే సందేహాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.


నేటి తరం సినిమాలు పూర్తిగా మారిపోయాయి. కమర్షియల్ మాస్ ఫార్ములా స్థానంలో కొత్త తరహా కాన్సెప్టులు, రియలిస్టిక్ కథనాలు, టెక్నికల్ వండర్స్ చోటు చేసుకుంటున్నాయి. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలను ఎంచుకోవడంలో వినాయక్ కొంత వెనుకబడ్డారనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే వినాయక్ కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే, వినాయక్ వంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడికి సరైన ఒక్క పవర్‌ఫుల్ స్క్రిప్ట్ పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన సరైన కథా బలం ఉన్న స్క్రిప్ట్ తయారీలో ఉన్నారని, సరైన సమయం చూసి రీఎంట్రీ ఇస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో  వినాయక్ మళ్లీ తన మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌తో విరుచుకుపడి, బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also read: పేపర్ లీకేజీకి అసలు కారణం ఇదే.. #విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు 

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకి  పైగా షేర్ తో ఘనవిజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత వినాయక్  దర్శకత్వం వహించిన 'ఇంటెలిజెంట్' కేవలం 20 శాతం రికవరీ కూడా సాధించలేక డిజాస్టర్‌గా నిలవడం ఆయన మార్కెట్‌పై పెద్ద దెబ్బకొట్టింది. ప్రభాస్  'ఛత్రపతి'ని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రీమేక్ చేసినప్పటికీ, ఆ చిత్రం కూడా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ వరుస పరాజయాలు ఆయన కెరీర్ వేగానికి పెద్ద బ్రేకులు వేశాయి. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'కథ నచ్చితే నల్లమలపు బుజ్జి నిర్మాతగా సినిమా ఉంటుందని చెప్పాడు. బుజ్జి కూడా ఒక ఇంటర్వ్యూ లో అదే చెప్పాడు. ఆదికి బెల్లంకొండ సురేష్ తో పాటు బుజ్జి కూడా నిర్మాత అనే విషయం తెలిసిందే.  

Vv Vinayak, Ntr, Chiranjeevi, Prabhas

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com