
కట్ అవుట్ కి తగ్గ కంటెంట్ తో అవకాశం చిక్కినప్పుడలా హీరోల తన సత్తా చూపిస్తూ వస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. బేబీ మూవీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకుడిగా పరిచయం అయ్యింది సంపూర్ణేష్ బాబు డెబ్యూ మూవీ హృదయకాలేయంతోనే. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం 'ది ప్యారడైజ్' చిత్రంలో 'బిర్యానీ' అనే పేరుతో కూడిన క్యారక్టర్ చేస్తున్నాడు. లుక్ కూడా రిలీజై వైరల్ గా మారింది.చేతిలో పెద్ద కత్తి, నోట్లో బీడీ, నుదుటున పచ్చబొట్టు, గుబురు జుట్టు, కోర మీసం, రక్తపు మరకలు ఉన్న చేతులతో సంపూ అత్యంత సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. దీంతో ఎప్పుడు కామెడీ, స్ఫూఫ్ సినిమాలతో నవ్వించే సంపూర్ణేష్ ఈసారి అస్సలు ఊహించని విభిన్నమైన మాస్ లుక్‌లో కనిపిస్తుండటం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సంపూర్ణేష్ కి అంతటి శక్తివంతమైన, కీలకమైన రోల్ ఎలా దక్కిందనే ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు సాయి రాజేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.నేను ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని రిక్వెస్ట్ చేయడం వల్లే సంపూ కోసంఆ ప్రత్యేక క్యారక్టర్ ని డిజైన్ చేశారు.సంపూర్ణేష్ బాబు మొదటి నుంచి హీరోగానే సినిమాలు చేస్తూ వస్తుండటంతో, వేరే హీరోల సినిమాల్లో సపోర్టింగ్,ఫ్రెండ్ రోల్స్ చేస్తారా లేదా అనే సందేహాలు చాలామందికి వచ్చాయి. కానీ సంపూ నటుడిగా తన పరిధిని విస్తరించుకోవాలనే మంచి నిర్ణయం తీసుకున్నారు .'బిర్యానీ' అనే పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని, అంతేకాకుండా 'ది ప్యారడైజ్' పూర్తికాగానే సంపూ కోసం తాను కూడా ఒక మంచి కథ రాయబోతున్నానని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.
Also read: వినాయక్ మాస్ శకం ముగిసినట్లేనా? టాలీవుడ్‌లో షాకింగ్ నిజాలు
sampoornesh Babu, sai Rajesh, Nani, Srikanth Odela







