Home

»

Latest News

Vtv Ganesh: ఏ పార్టీకి ఓటు వేశాడో చెప్పిన విటివి గణేష్..  ఆ హీరో ఫ్యాన్స్ కి షాక్  

Apr 23, 2026

 

నా మాట తీరు,హైట్, స్టమక్ చూసి తక్కువ అంచనా వేస్తున్నారా! అదంతా మీ అందర్నీ ఎంటర్ టైన్ మెంట్ చేయడం కోసం సినీ కళామతల్లి ప్రసాదించిన వరం. కానీ వీలు చిక్కినప్పుడు మాత్రం నా అంత డేరింగ్ పర్సన్ ఉండడు, ఎనీ డౌట్స్ అని సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నాడు ప్రముఖ నటుడు విటివి గణేష్. మరి పైన చెప్పుకున్న టైటిల్ కి తగ్గట్టుగా తన పవర్ ఏంటో చూద్దాం.

 
తమిళనాట ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. విటివి గణేష్(Vtv Ganesh)చెన్నైలోని నందనంలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకే ఓటు వేసాను. విజయ్‌(VIjay)పై ఉన్న నమ్మకంతోనే ఓటు వేయడం జరిగింది. తమిళనాడు ప్రజలు మార్పుని  కోరుకుంటున్నారు. యువతకి  విజయ్(Vijay) ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆయనకు ఉన్న ప్రజాదరణ, నిబద్ధత చూస్తుంటే తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఆయనే అవుతారని నా నమ్మకం. ఆయన రాజకీయాల్లోకి రావడం తమిళనాడు భవిష్యత్తుకి శుభసూచకం. నేను ఏ పార్టీని నిందించడం లేదు. నాకు విజయ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

also read: Ranya Rao: వన్ ఇయర్ తర్వాత  జైలు నుంచి రిలీజైన ప్రముఖ హీరోయిన్.. ఫ్యాన్స్ డాన్సులు 

మాములు పబ్లిక్ నే ఎలక్షన్స్ లో ఎవరకి ఓటు వేసారో చెప్పరు. కానీ సినీ పర్సనాలిటీ అయ్యి ఉండి విజయ్ కి ఓటు వేశానని  విటివి గణేష్  చెప్పడం ఇప్పుడు తమిళ నాట వైరల్ గా మారింది. అభిమానులు అయితే మీలో ఇంత ఫైర్ ఉంటుందని అనుకోలేదనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ ఫ్యాన్స్ అయితే షాక్ లో ఉన్నారు. గణేష్, విజయ్ చాలా సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.


  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com