Home

»

Latest News

Prabhas Fan: సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత.. ప్రభాస్ అభిమానిపై దాడి.. అసలేం జరిగింది?

Apr 23, 2026

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని 'సుదర్శన్' థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'రెబల్ స్టార్' ప్రభాస్ (Prabhas) నటించిన క్లాసిక్ హిట్ 'డార్లింగ్' (Darling 4K) రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ యాజమాన్యానికి, అభిమానికి మధ్య గొడవ జరిగింది. ఒక అభిమానిపై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. (Darling Re Release) 

ఈ ఘటనపై ప్రస్తుతం రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి:

పాటల తొలగింపుపై అభ్యంతరం: రీ-రిలీజ్ సినిమాల్లో సాధారణంగా అభిమానుల కోసం అన్ని పాటలను ప్లే చేస్తుంటారు. అయితే, ఒక షోలో పాటలు వేసి, తర్వాతి షోలో కొన్ని పాటలను కట్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించిన ఒక అభిమానిపై సిబ్బంది చేయి చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన?: మరోవైపు, థియేటర్ వర్గాల సమాచారం ప్రకారం.. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఒక మహిళపై అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని, ఆ క్రమంలోనే సిబ్బంది అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

డార్లింగ్ రీ-రిలీజ్ హంగామా:
ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన 'డార్లింగ్' సినిమా నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4K వెర్షన్‌లో గ్రాండ్ గా రీ-రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో ఈ వివాదం చోటు చేసుకోవడం అభిమానులను కలవరపెడుతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com