Home

»

Latest News

బాక్సాఫీస్ విధ్వంసం: 4 రోజుల్లోనే 150 కోట్ల క్లబ్ లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.!

Aug 18, 2026 6:15PM

కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగష్టు 14న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా సూర్య యాక్టింగ్, వెంకీ అట్లూరి రైటింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

తాజాగా మేకర్స్ అధికారికంగా కలెక్షన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లోనే ₹150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇది సూర్య కెరీర్‌లో వేగంగా ₹150 కోట్ల మార్కును అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

కథలోని పవర్‌ఫుల్ ఎమోషన్స్, తండ్రి-కొడుకుల మధ్య ఉండే అనుబంధం, వెంకీ అట్లూరి మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి. సూర్య తన నటనతో మరోసారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమా ఎమోషన్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీకెండ్ పూర్తయినప్పటికీ వర్కింగ్ డేస్‌లో కూడా ఈ రేంజ్ ఆక్యుపెన్సీ నమోదు కావడం చూస్తుంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్' లాంగ్ రన్‌లో మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

 

 

Vishwanath And Sons, Box Office, Suriya, Venky Atluri

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com