Home

»

Latest News

సంక్రాంతి రేసులో విశ్వంభర:  కాకా పరిస్థితి ఏంటి.. రిలీజ్ డేట్ వచ్చింది కదా!

Sep 12, 2026 12:46PM

 

 

విశ్వంభర vs  కాకా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండింటి మధ్య పోటీ ఏర్పడబోతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైగా కాకా సంక్రాంతి బరి నుంచి వెనక్కి వెళ్లనుందనే టాక్ సైతం సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి కి గురి చేస్తుంది.

 తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ని  వచ్చే సంక్రాంతి బరిలో దించేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్. 2025  సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన 'విశ్వంభర' ఇప్పటికే ఎన్నో వాయిదాలని ఎదుర్కొంటు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఓటిటి ఒప్పందం కుదిరిందని, సదరు ఓటిటి కంపెనీ డిమాండ్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో కాకా సంక్రాంతి డేట్ మారబోతుందని జోరుగానే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాకా రిలీజ్ డేట్ జనవరి 13 అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 


Also Read: గురువాయూర్ లో పవన్ కళ్యాణ్: ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియా షేక్ 

 
 ఆ లెక్కన  ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి బరిలోకి వస్తే.. రెండు మెగా చిత్రాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధ్యమవుతుందా? అనేదే పెద్ద  ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా చిరుతో పాటు రెండు చిత్రాల మేకర్స్ ఈ విషయంపై అధికారకంగా ముందు ముందు స్పందించే అవకాశం ఉంది.   

 

 

[Chiranjeevi, kaaka, Vishwambhara, Release dates, Sankranthi, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com