
'ప్రేమమ్' సినిమాతో సౌత్ ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్న మలయాళ హీరో నివిన్ పాలీ.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఇక "నివిన్ పాలీ కెరీర్ ముగిసిపోయింది" అంటూ ట్రోల్ చేసిన వారు కూడా ఉన్నారు. ఆ ట్రోల్స్ కు సమాధానం చెపుతూ గతేడాది 'సర్వం మాయ'తో కంబ్యాక్ ఇచ్చిన నివిన్.. ఈ ఏడాది 'బెత్లెహెం కుటుంబ యూనిట్'తో తన అసలుసిసలు బాక్సాఫీస్ స్టామినా చూపించాడు.
ఆగస్ట్ 21న థియేటర్లలోకి వచ్చిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్' చిత్రం ఇప్పుడు మలయాళ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 'ప్రేమలు' దర్శకుడు గిరీష్ ఎ.డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ కామిడీ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. ఒక సునామీనే సృష్టించింది.
ఇంతకుముందు కేరళ స్టేట్ ఆల్-టైమ్ రికార్డుగా ఉన్న 'వాలా 2' సాధించిన రూ.129.5 కోట్లను దాటేసి.. రూ.130 కోట్లతో కేరళ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన నంబర్ 1 సినిమాగా 'బెత్లెహెం కుటుంబ యూనిట్' నిలిచింది. కేవలం కేరళలోనే 80 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూశారు. బుక్ మై షో లోనే ఏకంగా 55 లక్షల టికెట్లు అమ్ముడై, ఒక మలయాళ సినిమా సాధించిన సరికొత్త ఆల్-టైమ్ రికార్డును సెట్ చేసింది.

ఇక వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. 'లోక పార్ట్ 1: చంద్ర' తర్వాత 300 కోట్ల క్లబ్‌లో చేరబోతున్న రెండో మలయాళ చిత్రంగా నిలవనుంది. త్వరలోనే 'లోక పార్ట్ 1: చంద్ర' కలెక్షన్స్ ను కూడా దాటేసి, మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది.
ఈ సినిమాలో నివిన్ పాలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, గిరీష్ ఎ.డి మార్క్ క్లీన్ అండ్ నాచురల్ హ్యూమర్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేసాయి.
ఒక సాదాసీదా కుటుంబ కథ, మన పక్కింట్లో జరిగే సరదా సంఘటనలు, గుండెకు హత్తుకునే ప్రేమానురాగాలు.. వీటినే దర్శకుడు ఎంతో అందంగా తెరకెక్కించాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు.
Bethlehem Kudumba Unit Movie, Kerala Industry Hit, Malayalam Highest Grossing Movies, Nivin Pauly, Mamitha Baiju, Girish AD, Vaazha 2 Collections, Telugu Film News, Telugu News






