
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుకు తెరదీశారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఏకంగా 3 విభిన్నమైన సినిమాలతో థియేటర్లలోకి రాబోతున్నారు. అక్టోబర్ 30న 'కల్ట్', నవంబర్ 19న 'ఈ నగరానికి ఏమైంది 2', డిసెంబర్ 4న 'లెగసీ' సినిమాలు విడుదల కానున్నాయి.
ప్రస్తుతం హీరోలు ఒక్కో సినిమాకు ఏడాది నుంచి రెండేళ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ విశ్వక్ సేన్ ఏకంగా ఐదు వారాల గ్యాప్‌లోనే మూడు పూర్తి డిఫరెంట్ జానర్ సినిమాలను థియేటర్లలోకి దించుతున్నాడు.
అక్టోబర్ 30న 'కల్ట్'..
ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. పోస్టర్స్, టీజర్లతోనే మాస్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది.

నవంబర్ 19న 'ENE REPEAT'..
యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి ఇది అఫీషియల్ సీక్వెల్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పాత గ్యాంగ్ అంతా కలిసి ఈ కామెడీ రైడ్ తో మళ్ళీ రచ్చ చేయడానికి వస్తున్నారు.
డిసెంబర్ 4న 'లెగసీ'..
పవర్, ఫ్యామిలీ, పాలిటిక్స్ అండ్ రివెంజ్ నేపధ్యంలో సాగే సాలిడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. బాలీవుడ్ నటుడు కే కే మీనన్ విలన్‌గా, 'పిండం' ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విశ్వక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా కాబోతోంది.
కేవలం 36 రోజులు.. అంటే అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 4 మధ్యలోనే ఈ మూడు సినిమాల విడుదల జరగబోతోంది. ఒక పక్క హర్రర్ స్లాషర్, ఇంకో పక్క ప్యూర్ యూత్‌ఫుల్ కామెడీ, మరొక పక్క ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా. ఒకే హీరో మూడు డిఫరెంట్ షేడ్స్‌లో ఇంత తక్కువ టైమ్‌లో కనిపించడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక రేర్ ఫీట్.
[Vishwak Sen, 3 Films in 36 Days, Cult Movie, ENE Repeat, Legacy Movie, Ee Nagaraniki Emaindi, Telugu Film News, Telugu News]






