Home

»

Latest News

ఢీ-10 విన్నర్ రాజు అరెస్ట్: సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు.!

Sep 12, 2026 3:33PM

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ-10 విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. ఈ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో రాజుపై ఒక యువతి ఫిర్యాదు చేసింది. 

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని రాజు ఆమెకు ఆశ చూపాడట. పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మబలికి, ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. 

అవకాశాల పేరుతో తనను దారుణంగా మోసం చేశాడని, వేధింపులకు గురిచేశాడని ఆ యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మియాపూర్ పోలీసులు.. తాజాగా రాజును అరెస్ట్ చేశారు. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించినట్లు సమాచారం.

 

 

[Dhee 10 Winner, Dancer Raju Arrest, Dhee Raju Case, Sexual Harassment Case, Dhee Raju, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com