
- ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ భారీ సంపాదన!
- అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకుందంటూ విమర్శలు!
సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, కొందరు సెలబ్రిటీలకు ఒక బలమైన ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్ ద్వారా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు భారీగా సంపాదిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వారిలో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) కూడా ఉన్నారు. అసభ్యకరమైన ఫోటోలతో యూత్ ని చెడగొడుతుందంటూ ఇటీవల ఆమెపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం హాట్ టాపిక్ గా మారింది.
నెలకు రూ.11 లక్షలు!
విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు సుమారు రూ. 10 లక్షల నుండి రూ. 11 లక్షల వరకు సంపాదింస్తున్నట్లు తెలుస్తోంది. తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలు చూడాలనుకునే వారి కోసం ఆమె నెలకు రూ. 390 నుంచి రూ. 399 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు సుమారు 2700 నుండి 3000 మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారని అంచనా. దీంతో రూ. 11 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీనికి అదనంగా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా ఆమె భారీగానే ఆదాయాన్ని పొందుతున్నారు.

పెరుగుతున్న విమర్శలు - పోలీసు ఫిర్యాదు!
విష్ణుప్రియ సంపాదన ఒక ఎత్తు అయితే, ఆమె పోస్ట్ చేసే కంటెంట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకుని.. అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (AISF) నేతలు ఆమెపై విజయవాడలోని సూర్యరావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం సమాజానికి హానికరమని వారు పేర్కొన్నారు.
సోషల్ మీడియా ట్రెండ్, వివాదాలు!
గతంలో కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించిన గ్లామర్ ట్రీట్, ఇప్పుడు నేరుగా సోషల్ మీడియా ఖాతాల్లోకి వచ్చేసింది. విష్ణుప్రియ తన ఫిట్‌నెస్ వీడియోలు, గ్లామర్ ఫోటోషూట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అయితే, సబ్‌స్క్రిప్షన్ పేరిట ఘాటు ఫొటోలతో డబ్బు సంపాదించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటుంటే, మరికొందరు సెలబ్రిటీగా బాధ్యత ఉండాలని సూచిస్తున్నారు.
విష్ణుప్రియ చుట్టూ జరుగుతున్న ఈ వివాదం భవిష్యత్తులో సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్లపై ఎలాంటి నియంత్రణలకు దారితీస్తుందో చూడాలి.






