Home

»

Latest News

Ntr: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే! మీరు ఇదే అనుకున్నారా!

Apr 15, 2026

 

-ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న టైటిల్ అనౌన్స్ మెంట్ 
-అప్డేట్స్ కోసమైతే ఫ్యాన్స్ ఎదురుచూపులు 
-ఇంతకీ ఆ టైటిల్ ఇదేనా!


సినీ సర్కిల్స్ లో ప్రెజెంట్ అత్యంత విలువైన, అమూల్యమైన న్యూస్ లో ఎన్టీఆర్(Ntr),త్రివిక్రమ్(Trivikram)కాంబో ఒకటి. ఈ కాంబోలో తెరకెక్కబోతున్న శివ,పార్వతుల పుత్రుడు కుమారస్వామి అలియాస్ సుబ్రహ్మణ్యుడు, అలియాస్ షణ్ముఖుడు, కార్తికేయుడి కథ ఏ విధంగా ఉండబోతోందనే ఎగ్జైట్మెంట్  రోజు రోజుకి అభిమానుల్లో, మూవీ లవర్స్ లో టన్నుల కొద్దీ పెరుగుతూనే ఉంది. వాళ్ళందరి ఎగ్జైట్మెంట్ ని మరింత పెంచేలా విత్ ఇన్ షార్ట్ డేస్ లో ఒక విలువైన సమాచారం రాబోతుందనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో మనం కూడా చూసేద్దాం.

ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న అనే విషయం తెలిసిందే. ఆ రోజు టైటిల్ ని ప్రకటించబోతున్నట్టుగా టాక్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే 'షణ్ముఖుడు'(Shanmukhudu). అవును ఈ టైటిల్ నే మేకర్స్  రిజిస్టర్ చేయించారని ఫిలిం సర్కిల్స్ కోడై కూస్తుంది. సోషల్ మీడియాలోకూడా బాగానే వైరల్ అవుతున్న షణ్ముఖుడు టైటిల్ తో ఫ్యాన్స్ అయితే నిమిషాల్లోనే డిజిటల్ క్రియేటర్స్ గా మారి ఎన్టీఆర్ రూపుకి షణ్ముఖుడు టైటిల్ ని ఫిక్స్ చేసి షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యాకే త్రివిక్రమ్ తో జాయిన్ అవుతాడు. త్రివిక్రమ్ కూడా వెంకీ గౌడ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ మూవీ పనులు స్టార్ట్ చేస్తాడు.

also read: Vishnupriya: విష్ణుప్రియ కొత్త వీడియో వైరల్.. దేవుడిచ్చిన బాడీ వాళ్ళ కోసమే! 

పురాణాల, ఇతిహాసాల నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుండగా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పై   రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. గతంలో ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' తెలుగు సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. 

 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com