Home

»

Latest News

Vijay: సిఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర అసంతృప్తి.. సంచలన ట్వీట్ 

May 18, 2026

 

ఇళయ దలపతి విజయ్(Vijay)ముఖ్యమంత్రి అయ్యాక స్కూల్స్, దేవాలయాలు, ప్రార్థన మందిరాలకి దగ్గరగా ఉన్న మద్యం దుకాణాలని తొలిగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై విజయ్ పుట్టిల్లు సినిమా పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. విశాల్(Vishal)కూడా విజయ్ ని అభినందించడం జరిగింది. కానీ ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయమై విశాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తునాడు. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం.

ఫిల్మ్ టెక్నాలజీ అండ్ సినిమాటోగ్రాఫ్ శాఖని  ఎగ్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌ కి విజయ్  కేటాయించారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపైనే హీరో విశాల్  ఎక్స్ వేదికగా స్పందిస్తూ నూతన ముఖ్యమంత్రి విజయ్ గారు ఎమ్మెల్యేలకి  మంత్రి పదవులు కేటాయించడం సంతోషకరమే. కానీ సినిమా రంగానికి సంబంధించిన శాఖని ఎగ్మూర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌ కి  అప్పగించడం  ఎంతగానో నిరాశకి  గురి చేసింది దశాబ్దాలుగా సినిమా రంగంలోనే ఉంటూ, ఇండస్ట్రీ కష్టసుఖాలను నరనరాల్లో జీర్ణించుకున్న విజయ్ గారే స్వయంగా ఈ శాఖను తన వద్దే ఉంచుకుని ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది. తమిళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇండస్ట్రీ 'రక్తసిక్తం' అవుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో సినిమా కష్టాలు పూర్తిగా తెలిసిన విజయ్ గారు నేరుగా రంగంలోకి దిగితేనే చిత్ర సీమకి  ఒక నూతన ఆశాకిరణంగా  కనిపిస్తుందని విశాల్ తన ట్వీట్ లో తెలిపాడు.


Also read: Teja sajja: తేజ సజ్జ ప్లానింగ్ వైరల్.. పెద్ద హీరోలు కూడా ఆ సూత్రం ఫాలో అయితే! 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com