Home

»

Latest News

విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. దర్శకుడిగా మొదటి సినిమాతోనే సంచలనం.!

Aug 5, 2026 5:50PM

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్.బి చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు.

ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు.

 

 

Vishal, Makutam Movie, Anjali, Dushara Vijayan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com