Home

»

Latest News

విశాల్ 'మకుటం' ట్విట్టర్ రివ్యూ: డైరెక్టర్‌గా పాస్ అయ్యాడా.?

Aug 14, 2026 11:20AM

యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్ మొదటిసారి మెగాఫోన్ పట్టాడు. విశాల్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మకుటం' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 99వ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ సినిమా, ఫస్ట్ డే ఫస్ట్ షో పడిందో లేదో.. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్ (X) లో రివ్యూల వర్షం కురుస్తోంది.

సినిమా కథ విషయానికి వస్తే.. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఒక సామాన్య తండ్రి, తన కొడుకుని ప్రమాదకరమైన క్రిమినల్స్ నుంచి కాపాడుకోవడానికి తన గతాన్ని, హింసాత్మకమైన నేపథ్యాన్ని తిరగరాయాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. సెంటిమెంట్, యాక్షన్ సమిష్టిగా కలగలిపిన పక్కా మాస్ కథ ఇది.

మరి మొదటి షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్‌లో ఏమంటున్నారంటే.. "అంబిషియస్, గ్రాండ్ అండ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్!" అని చెబుతున్నారు. విశాల్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, ఆయన దర్శకత్వ ప్రతిభ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో ఉండే మూడు భారీ యాక్షన్ సీక్వెన్సులు బిగ్ స్క్రీన్ మీద కేక పెట్టించేలా ఉన్నాయట. దిలీప్ సుబ్బరాయన్ డిజైన్ చేసిన ఈ ఫైట్స్ మాస్ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయని కామెంట్స్ వేస్తున్నారు.

అసలైన హైలైట్ ఏంటంటే.. ఈ సినిమా క్లైమాక్స్. క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని, విశాల్ ఒక డైరెక్టర్‌గా సెకండ్ హాఫ్‌ను, ముగింపును ప్లాన్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని ట్వీట్స్ దర్శనమిస్తున్నాయి.

హీరోయిన్లు దుషారా విజయన్, అంజలి ఇద్దరూ కథకి చాలా కీలకమైన పాత్రలలో మెరిశారు. పవర్ ఫుల్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడానికి వీరి పర్‌ఫార్మెన్స్ ఎంతగానో ఉపయోగపడింది. ఇక సపోర్టింగ్ క్యాస్టింగ్ విషయానికి వస్తే.. జాన్ విజయ్, జయప్రకాష్, వంశీ కృష్ణ లాంటి నటులు సినిమా గ్రాండ్‌నెస్‌ని పెంచేశారు.

టెక్నికల్ సైడ్ చూస్తే.. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకి ప్రాణం పోసింది. నాథన్, అభినందన్ రామానుజమ్, జై కార్తీక్ అందించిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. తెలుగు డైలాగ్స్ విషయానికి వస్తే రాజేష్ ఎ. మూర్తి అందించిన సంభాషణలు చాలా పవర్‌ఫుల్‌గా పేలాయి.

మొత్తానికి 'మకుటం' సినిమాతో విశాల్ కేవలం హీరోగానే కాదు, ఒక మాస్ అండ్ ఎమోషనల్ డైరెక్టర్‌గా కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ సాధించారని టాక్ స్పష్టంగా చెబుతోంది. ఒక వైపు గుండెను పిండేసే ఫాదర్-సన్ సెంటిమెంట్.. మరోవైపు సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ విశాల్ బాక్సాఫీస్ దగ్గర తన 'మకుటాన్ని' పదిలం చేసుకున్నారు.

 

 

 

Vishal, Makutam Review, Magudam Review, Makutam Public Talk, Magudam Public Talk

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com