THANK YOU: `ప్రియ`ని వదలని విక్రమ్!
on May 24, 2022
చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంతకీ విక్రమ్ కి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే.. `ప్రియ`. తన చిత్రాల్లో కథానాయిక ఎవరైనా.. క్యారెక్టర్ నేమ్ మాత్రం `ప్రియ`ని కొనసాగిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు విక్రమ్.
ఆ వివరాల్లోకి వెళితే.. తన మూడో చిత్రం `13 బి`లో నీతూ చంద్ర పాత్ర పేరు ప్రియ కాగా.. ఆపై వచ్చిన `ఇష్క్`లో నిత్యా మీనన్ క్యారెక్టర్ నేమ్ కూడా ప్రియనే. అలాగే `మనం`లో సమంత రెండు వేషాల్లో కనిపించగా.. అందులో ఒక పాత్ర పేరు ప్రియ. ఇక `24` విషయానికి వస్తే.. ఇందులో నిత్యా మీనన్ పాత్ర పేరు ప్రియ. అదే విధంగా.. `హలో`లో కళ్యాణి ప్రియదర్శన్ క్యారెక్టర్ నేమ్, `గ్యాంగ్ లీడర్`లో ప్రియాంక అరుళ్ మోహన్ రోల్ నేమ్ ప్రియనే. అంతేకాదండోయ్.. ఈ జూలై 8న రాబోతున్న విక్రమ్ కొత్త చిత్రం `థాంక్ యూ`లోనూ చిత్ర కథానాయిక రాశీ ఖన్నా పాత్ర పేరు ప్రియ అని సమాచారం. మొత్తమ్మీద.. `13 బి` నుంచి `థాంక్ యూ` వరకు వరుసగా ఏడు చిత్రాల్లో తన కథానాయిలకి ఒకే క్యారెక్టర్ నేమ్ రిపీట్ చేస్తూ వస్తున్నారు విక్రమ్ కె. కుమార్. మరి.. రాబోయే సినిమాల్లోనూ ఇదే శైలిని కొనసాగిస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే, నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `థాంక్ యూ`ని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
Also Read