Home

»

Latest News

అల్లు అర్జున్‌కి ముగ్గురు...

Mar 13, 2020 10:04AM

సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం నేపథ్యంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా ఓ సినిమా రూపొందుతోంది కదా! అందులో అల్లు అర్జున్‌కి విలన్‌గా జగపతిబాబు ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో స్టయిలిష్, మోడ్రన్ విలన్‌గా... 'రంగస్థలం'లో పక్కా పల్లెటూరి విలన్‌గా జగపతిబాబును సుకుమార్ చూపించారు. ఇప్పుడీ అల్లు అర్జున్ సినిమాలో ఆయన్ను చిత్తూరు వాసిగా, కొత్త విలన్ రోల్‌లో చూపించడానికి రెడీ అయ్యారు. జగపతిబాబుతో పాటు ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి మరో విలన్ రోల్ చేస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'లో విలన్ రోల్ చేసింది అతడే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... ఈ సినిమాలో విజయ్ సేతుపతిది కూడా విలన్ రోల్ అని సమాచారం. ఫారెస్ట్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి చేసేది విలన్ క్యారెక్టరే. మొత్తం మీద ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి ముగ్గురు విలన్లు అన్నమాట. అతి త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సుకుమార్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తారని యూనిట్ చెబుతోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com