Home

»

Latest News

లేడీ సూప‌ర్ స్టార్‌తో క్రేజీ స్టార్!!!

Mar 4, 2019 10:12AM

త‌క్కువ టైమ్ లో నే క్రేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అలాగే త‌మిళ‌నాడులో కూడా మంచి క్రేజే ఉంది. అయితే నోటా సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో బైలింగ్వ‌ల్ మూవీ చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ  సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్  చ‌ల్ చేస్తోంది. అదేంటంటే....లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న న‌య‌త‌న తార కూడా ఈ సినిమాలో న‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి హీరోయిన్ గా చేస్తుందా?  లేక ఇంపార్టెంట్ క్యార‌క్ట‌ర్ ప్లే చేస్తుందా? అన్న విష‌యంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే  ఈసినిమాలో విజ‌య్ బైక్ రేస‌ర్ గా కనిపించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రానికి హీరో టైటిల్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. త‌మిళ ద‌ర్శ‌కుడు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. ప్ర‌జంట్ విజ‌య్  డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. అలాగే క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com