ENGLISH | TELUGU  

'ఖుషి'లో విజ‌య్‌, స‌మంత మధ్య ఇంటిమేట్ సీన్లు!

on May 21, 2022

 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న రొమాంటిక్ ఫిల్మ్ 'ఖుషి' టైటిల్ ట్రాక్ వ‌చ్చేసింది. ఇటీవ‌ల క‌శ్మీర్‌లో షూటింగ్ సంద‌ర్భంగా తాము గ‌డిపిన క్ష‌ణాల‌తో కూడిన టైటిల్ ట్రాక్ వీడియో ప్రోమోను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు విజ‌య్‌. ఆ వెంట‌నే ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ అభిమానులు సోష‌ల్ మీడియాను కామెంట్ల‌తో ముంచెత్తారు. ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వ‌స్తుందా అనే కుతూహ‌లాన్ని ఈ ప్రోమో క‌ల‌గ‌జేసింది.

వీడియోతో పాటు "We are touched by the overwhelming Love. We will bring all this love onto the Big screen this Christmas - Newyears Meanwhile, here is our Title track that you love #Kushi. Dec 23 worldwide release.Telugu - Tamil - Kannada - Malayalam." అంటూ రాసుకొచ్చాడు విజ‌య్‌.

దాంతో సినిమాలో విజ‌య్‌, స‌మంత మ‌ధ్య మంచి మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయ‌నీ, వాటిలో ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయ‌నీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'మ‌హాన‌టి'లో జంట‌గా న‌టించిన‌ప్ప‌టికీ అందులో వారికి రొమాంటిక్ సీన్లు ఏమీ లేవు. ఇప్పుడు 'ఖుషి'లో ఇద్ద‌రూ తెర‌పై బోల్డంత రొమాన్స్ కురిపిస్తార‌ని స‌మాచారం.

శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి మ‌ల‌యాళం మూవీ 'హృద‌యం'కు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చిన హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ బాణీలు స‌మ‌కూరుస్తున్నాడు. ఇక 'మ‌జిలీ' త‌ర్వాత శివ నిర్వాణ డైరెక్ష‌న్‌లో మ‌రోసారి న‌టిస్తోంది స‌మంత‌. ఇందులో జ‌య‌రామ్‌, స‌చిన్ ఖెడేక‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ల‌క్ష్మి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, శ‌ర‌ణ్య ఇత‌ర ముఖ్య పాత్ర‌ధారులు.

మూడు వారాలుగా క‌శ్మీర్‌లో 'ఖుషి' షూటింగ్‌లో ఉన్నారు విజ‌య్‌, స‌మంత‌. ఈ ఏడాది డిసెంబ‌ర్ 23న తెలుగుతో పాటు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ రొమాంటిక్ డ్రామా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.