
ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.
ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం.
Also read: శ్రీలీలని వెంటాడుతున్న దురదృష్టం.. వైఫే లా ఉండదు కదా!
ఇక బాక్సాఫీస్ వద్ద విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం.
Viswanath And Sons, Suriya, Mamitha Bhaiju, Venky Atluri





