Home

»

Latest News

డ‌బుల్ హ్యాట్రిక్ దిశ‌గా వెంకీ!

Jan 22, 2022 12:14PM

సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ కి విజ‌యాలు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే..  స్టార్ హీరోల్లో హై స‌క్సెస్ రేట్ ఉన్న క‌థానాయ‌కుల్లో వెంకీ ముందు వ‌రుస‌లో ఉంటారు.

ఇదిలా ఉంటే.. రీసెంట్ టైమ్స్ లో అటు థియేట‌ర్స్ లోనూ, ఇటు ఓటీటీలోనూ వెంకీ వ‌రుస‌గా ఐదు విజ‌యాలు న‌మోదు చేసి వార్త‌ల్లో నిలిచారు. `గురు` (2017), `ఎఫ్ 2` (2019), `వెంకిమామ‌` (2019)తో థియేట‌ర్స్ లో హ్యాట్రిక్ కొట్టిన వెంక‌టేశ్.. గ‌త సంవ‌త్స‌రం ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `నార‌ప్ప‌`, `దృశ్యం 2`తోనూ వీక్ష‌కుల‌ను రంజింప‌జేసి బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ హిట్స్ అందుకున్నారు. మొత్తంగా.. క‌థానాయ‌కుడిగా చాలా కాలం త‌రువాత ఐదు వ‌రుస విజ‌యాలు చూశారు విక్ట‌రీ వెంక‌టేశ్.

ఈ నేప‌థ్యంలో.. వెంకీ నుంచి రానున్న కొత్త చిత్రం `ఎఫ్ 3`పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొని ఉంది. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా త‌యార‌వుతున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న థియేట‌ర్స్ లోకి రాబోతోంది. మ‌రి.. డ‌బుల్ హ్యాట్రిక్ దిశగా వెంకీ చేస్తున్న ప్ర‌య‌త్నం.. ఏ స్థాయిలో వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

కాగా, `దిల్` రాజు నిర్మిస్తున్న `ఎఫ్ 3`ని వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com