Home

»

Latest News

టాలీవుడ్ స్టార్స్ @ బ్యాక్ టు బ్యాక్ హిట్స్!

Jan 22, 2022

గ‌త కొంత‌కాలంగా తెలుగునాట కొంద‌రు క‌థానాయ‌కులు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు.   ఆ స్టార్స్ వివ‌రాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవిః `ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్ రి-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. స‌ద‌రు సోష‌ల్ డ్రామాతో కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ చూశారు. ఆపై `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగించారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ః విక్ట‌రీని త‌న ఇంటిపేరు చేసుకున్న సీనియ‌ర్ స్టార్ వెంక‌టేశ్.. ఇటీవ‌ల కాలంలో త‌ను న‌టించిన ప్ర‌తీ చిత్రంతోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తూనే ఉన్నారు. ఆ మ‌ధ్య `గురు`, `ఎఫ్ 2`, `వెంకిమామ‌` చిత్రాల‌తో థియేట్రిక‌ల్ హ్యాట్రిక్స్ కొట్టిన వెంకీ.. గ‌త ఏడాది `నార‌ప్ప‌`, `దృశ్యం 2`తో ఓటీటీలోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు.

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుః  గ‌త కొంత‌కాలంగా మ‌హేశ్ బాబు పట్టింద‌ల్లా బంగార‌మే. `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. ఇలా వ‌రుస‌గా మూడు మ‌ర‌పురాని విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు మ‌హేశ్.

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ః  నందమూరి యువ సంచ‌ల‌నం ఎన్టీఆర్ నుంచి ఈ మ‌ధ్య వ‌చ్చిన ఏ సినిమా కూడా ఫెయిల్యూర్ కాలేదు. `టెంప‌ర్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌`, `అర‌వింద స‌మేత‌`.. ఇలా వ‌రుస‌గా ఐదు చిత్రాల‌తో తెలుగు జ‌నాన్ని రంజింప‌జేశారు తార‌క్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ః  ఆ మ‌ధ్య కాస్త ట్రాక్ త‌ప్పిన అల్లు అర్జున్.. రీసెంట్ టైమ్స్ లో మ‌ళ్ళీ త‌న హ‌వా చూపిస్తున్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో`, `పుష్ప - ద రైజ్`తో బ్యాక్ టు బ్యాక్ సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసుకున్నారు బ‌న్నీ.

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్యః  అక్కినేని యువ సంచ‌ల‌నం నాగ‌చైత‌న్య కూడా గ‌త కొంత‌కాలంగా వ‌రుస విజ‌యాల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. `మ‌జిలీ`, `వెంకిమామ‌`, `ల‌వ్ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశాడీ యంగ్ హీరో.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ః `ఇస్మార్ట్ శంక‌ర్`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న రామ్.. ఆపై వ‌చ్చిన `రెడ్`తో చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ చూసి వార్త‌ల్లో నిలిచాడు.

యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పోలిశెట్టిః  `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`, `జాతిర‌త్నాలు`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆక‌ర్షించాడు యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పోలిశెట్టి.

మ‌రి..  రాబోయే సినిమాల‌తోనూ వీరంతా ఈ విజ‌య‌ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తారేమో చూడాలి.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com