Home

»

Latest News

వెంకటేష్ హీరోగా సురేష్ కృష్ణ సినిమా

Jun 13, 2011 4:40PM

వెంకటేష్ హీరోగా సురేష్ కృష్ణ సినిమా ప్రారంభించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా, "ప్రేమ, ధర్మచక్రం" వంటి విభిన్న కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు సురేష్ కృష్ణ ప్రస్తుతం వెంకటేష్ కోసం ఒక చక్కని విభిన్నమైన కథను తయారు చేశారట. సురేష్ కృష్ణ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, "బాషా" అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా "రాఘవేంద్ర" అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూందని తెలిసింది. వెంకటేష్ ప్రస్తుతం శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, త్రిష, సలోనీ హీరోయిన్లుగా నటిస్తూండగా, "డాన్ శీను" ఫేం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న "బాడీగార్డ్" సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కోనవేంకట్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తుండగా, తమన్ సంగీతాన్నందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com