.webp)
'కేరాఫ్ కంచెరపాలెం' సినిమాతో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు వెంకటేష్ మహా. ఆ తర్వాత కూడా 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య', 'రావు బహదూర్' సినిమాలతో తన ప్రతిభను చాటుకున్న వెంకటేష్.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. అదే "అట్టహాసం".
ఈ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహించడంతో పాటు, లీడ్ రోల్ కూడా పోషిస్తుండటం విశేషం. ఇప్పటికే పలు సినిమాలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన వెంకటేష్.. ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.
"క" వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ మహాయాన బ్యానర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో వెంకటేష్ మహాతో పాటు కార్తీక్ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ రోజు "అట్టహాసం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రెండు జంటలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక జంటకు 'మాకు మోక్షం కావాలి...' అని, మరొక జంటకు 'మాకు ఉద్యోగం కావాలి..' అని క్యాప్షన్స్ రాయడం ఆసక్తి కలిగిస్తోంది.
రియల్, రూటెడ్, ఆంథెటిక్ ఎంటర్ టైనర్ గా "అట్టహాసం" సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు.
ఇది కూడా చదవండి: క్రేజీ కళ్యాణం.. ఇద్దరు స్టార్స్‌తో పోటీకి సై అంటున్న అనుపమ.!

[Attahaasam First Look, Venkatesh Maha New Movie, Attahaasam Movie, Care Of Kancharapalem, Rao Bahadur, Venkatesh Maha, Sravanthi Pepakayala, Pavani Karanam, Karthik Rathnam, Telugu Film News]





