Home

»

Latest News

వెంకటేష్, త్రిష జంటగా చిత్రం

Mar 25, 2011 11:40AM

venkatesh wallpapers, venkatesh stills, venkatesh images, venkatesh pics, venkatesh photos, venkatesh picturesవెంకటేష్, త్రిష జంటగా ఒక చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో వెంకటేష్, త్రిష జంటగా "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే", "నమో వెంకటేశా" అనే చిత్రాల్లో నటించారు. ఇది వెంకటేష్, త్రిష కలసి నటిస్తున్న మూడవ చిత్రం కావటం విశేషం.

ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ గతంలో రవితేజ హీరోగా నటించిన "డాన్ శీను" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. డాన్ శీను ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. వెంకటేష్ హీరోగా, త్రిస్హ హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రం ఏప్రెల్ నెల మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com