Home

»

Latest News

రామ్ చరణ్ రచ్చ ఏప్రెల్ 24 నుండి

Mar 25, 2011 10:57AM

ram charan wallpapers, ram charan stills, ram charan images, ram charan pics, ram charan photos, ram charan picturesరామ్ చరణ్ రచ్చ ఏప్రెల్ 24 నుండి కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో రామ్ చరణ్ తేజ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్ వి ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ రామ్ చరణ్ హీరోగా నటించబోయే "రచ్చ" చిత్రం ఏప్రెల్ 24 నుండి షూటింగ్ ప్రారంభించుకోనుందని తెలిసింది. ఈ చిత్రం కోసం హీరో రామ్ చరణ్ ఎయిట్ ప్యాక్ కోసం అమెరికాలోని మియామీ బీచ్ లో ఉన్న డేవిడ్ బర్టన్ జిమ్ లో గత నెల రోజులుగా చాలా తీవ్రంగా వ్యాయామం చేస్తున్నాడు.

ఈ చిత్రం టైటిల్‍ నిజానికి యన్ టి ఆర్ హీరోగా, సురేంద్రరెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి పెడదామని అనుకున్నారు. కాని ఈ "రచ్చ" టైటిల్ దర్శకుడు సంపత్ నంది పేరున రిజిస్టర్ అయి ఉండటం వల్ల రామ్ చరణ్ సినిమాకి దక్కింది. ఈ "రచ్చ" మూవీలో మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com