Home

»

Latest News

Karthi: సూర్యపై సోదరుడు కార్తీ కీలక వ్యాఖ్యలు.. ఈ సారి కొట్టినట్టేనా!

May 11, 2026


రెండు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో తిష్ట వేసుకొని కూర్చుకున్న సూర్య(Suriya)ఈ నెల 14 న 'వీరభద్రుడు'(Veerabadrudu)తో రాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాలు తమిళ టైటిల్స్ తోనే రిలీజ్ అవుతున్నాయి. కానీ సూర్య మాత్రం అచ్చ తెలుగు టైటిల్ తో వస్తున్నాడు. దీన్ని బట్టి తెలుగు ప్రేక్షకులంటే ఎంత అభిమానమో అర్ధం చేసుకోవచ్చు. తమిళ్ లో 'కరుప్పు 'టైటిల్ అనే విషయం తెలిసిందే. అభిమానులైతే  సూర్య వరుస పరాజయాలకి  వీరభద్రుడు ముగింపుని ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

నిన్న హైదరాబాద్ లో  'వీరభద్రుడు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ హాజరైన సూర్య సోదరుడు ప్రముఖ హీరో కార్తీ(karthi)మాట్లాడుతు బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని తన భుజాలపై ఎలా మోశారో, అన్నయ్య కూడా తన భుజాలపై ఎంతటి భారమైన బాధ్యతనైనా  సులభంగా మోయగలరు. సూర్య వర్క్ ఎథిక్స్ అలాంటివి. 'వీరభద్రుడులో అన్నయ్య  నటన చూస్తుంటే ఆయనకు దేవుడు పూనినట్లు అనిపిస్తోంది. ఇలాంటి పవర్‌ఫుల్ మాస్ పాత్రను అన్నయ్య తప్ప మరెవరూ చేయలేరు. 'గజిని' రోజుల నాటి ఎనర్జీని గుర్తుకి తెస్తుంది.

Also read: Trisha: రజినీ, కమల్ తో త్రిష భేటీ కానుందా!..పూర్తి డీటెయిల్స్ ఇవే 

చాలామంది ఒకే సంతానం చాలు అనుకుంటారు, కానీ ఒక అన్నయ్య ఉండటం ఎంత అదృష్టమో నాకు తెలుసు. నాన్న నన్ను ఎత్తుకుంటే, అన్నయ్య నన్ను తన భుజాల మీద మోశాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి అన్నయ్య కష్టమే పునాది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ఇరువురి ఫ్యాన్స్, నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నాయి. సూర్య సరసన త్రిష జంటగా చేసిన వీరభద్రుడుకి ఆర్ జె బాలాజీ(RJ Balaji)దర్శకుడు. డ్రీం వారియర్ పిక్చర్స్ పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com