
దక్షిణాది సినీ పరిశ్రమలో గత రెండు దశాబ్దాలుగా తన జోరు కొనసాగిస్తున్న నటి త్రిష. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత వేగంగా దూసుకుపోతుంది. అందులో భాగంగా ఈ నెల 14 న సూర్య తో కలిసి కరుప్పన్ తో సందడి చేయనుంది. చిరంజీవితో విశ్వంభర కూడా చేస్తున్న త్రిష ఖాతాలో కి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది.
భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే అరుదైన ప్రాజెక్ట్ కమల్, రజినీ ప్రాజెక్ట్. దశాబ్దాల తర్వాత కలిసి ఆ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీలోత్రిషని ఒక హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో రజినీ, కమల్ లో త్రిష ఎవరకి జోడి కడుతుందనే ఆసక్తి మొదలైంది. కమల్ తో ఇప్పటికే థగ్ లైఫ్ లో జత కట్టిన విషయం తెలిసిందే. రజినీ తో పేట మూవీలో కూడా చేసింది. ఈ ప్రాజెక్ట్ ని జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
also read: ఓటిటిలోకి మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్, డేట్ ఎప్పుడంటే
ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోలో రజనీకాంత్, కమల్ హాసన్ తమదైన స్టైల్ మరియు స్వాగ్‌తో కనిపించి అభిమానులని ఉర్రూతలూగించారు.హీరో ఎవరు అనే డైలాగ్‌తో సాగే ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రంలో త్రిష కూడా చేరడం సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సుమారు ₹500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.






