Home

»

Latest News

karuppu: వీరభద్రుడు ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే!

Jun 8, 2026 12:04PM


సూర్య(Suriya)స్టార్ స్టేటస్ కి కాపాడటంతో పాటు సదరు స్టార్ ఇమేజ్ ని మరింతగా పెంచిన చిత్రం కరుప్పు ఉరఫ్ వీరభద్రుడు(veerabhadrudu). గత నెల 15 న థియేటర్స్ లో అడుగుపెట్టగా, స్టిల్ 300 కోట్ల క్లబ్ ని దాటింది. ఆర్‌జే బాలాజీ(Rj Balaji) తెరకెక్కించిన  ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ఓ టి టి డేట్ ఇదేనంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఓటిటి ప్రియులు మా టైం స్టార్ట్ అయ్యిందనే ఆనందంలో ఉన్నారు. మరి ఆ వివరాలు చూద్దాం 


 ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్ వీడియో' కరుప్పుని భారీ ధరకి  సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 11   మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  అదే నిజమైతే ఓ టిటి సినీ ప్రియులకంటే అదృష్టవంతులు లేరని చెప్పవచ్చు .


Peddi: నాలుగురోజుల కలెక్షన్స్ ఇవే.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ 

సూర్య  కోర్టు రూమ్‌లో న్యాయం కోసం పోరాడే లాయర్ గా, దైవాంశ సంభూతుడైన వీరభద్రుడుగా డ్యూయల్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ లో మెప్పించాడు.సదరు పెర్ఫార్మ్ థియేటర్లలో ప్రేక్షకులకి పూనకాలు తెప్పించింది. లాయర్ ప్రీతి క్యారక్టర్ లో త్రిష సెటిల్డ్ పెర్ఫార్మ్ కూడా బాగుంటుంది. ఆర్‌జే బాలాజీ స్వయంగా బేబీ కృష్ణ అనే నెగటివ్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాడు. . ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణియన్, అనఘ మాయ రవి తదితరులు కీ రోల్స్ లో ఉత్తమ నటనని  కనబరిచారు. సాయి అభ్యంక్కర్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కరుప్పుని   మరో స్థాయికి తీసుకెళ్లింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com