మెగాప్రిన్స్ ను అమెరికన్ గా మార్చేసిన శేఖర్ కమ్ముల..!
on May 21, 2016
శేఖర్ కమ్ముల సినిమాల్లో తెలుగు నేటివిటీ కనిపిస్తుంటుంది. కుటుంబమంతా కూర్చుని ప్రశాంతంగా చూసేలా ఆయన సినిమాలుంటాయి. అయితే అనామిక తర్వాత శేఖర్ కమ్ముల అడ్రస్ లేడు. ఆయన సినిమా కోసం ఎదురుచూసే అభిమానులున్నా ఎందుకు ఏ ప్రాజెక్టూ కమిట్ కాలేదో, నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. అయితే లేటెస్ట్ గా ఆయన లేటెస్ట్ సినిమా అప్ డేట్ బయటికొచ్చింది. ఒక మంచి ప్రేమకథా చిత్రంతో శేఖర్ సినిమా తెరకెక్కించబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమాలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్ ఇంకా తేలాల్సి ఉంది. అమెరికాలో పెరిగిన అబ్బాయికి, స్వచ్ఛమైన తెలంగాణా అమ్మాయికి మధ్య జరిగే ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఇదని, దిల్ రాజు చెబుతున్నారు. స్వతహాగా ప్రేమకథను హృద్యంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకుడు కావడంతో శేఖర్ కమ్ముల స్టైల్ ఊహించుకుని ఇప్పటికే వరుణ్ ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. సినిమా క్యాస్టింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మూవీ టీం. ఇప్పటికే శ్రీను వైట్ల సినిమా ప్రేమకథే కాగా, తాజాగా మరో ప్రేమకథను ఒప్పుకుని లవర్ బాయ్ ట్యాగ్ దిశగా సాగుతోంది వరుణ్ తేజ్ కెరీర్.