Home

»

Latest News

ఫిబ్ర‌వ‌రికి `గ‌ని` వాయిదా?

Dec 1, 2021 11:27AM

`ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ త‌రువాత మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నుంచి రానున్న చిత్రం `గ‌ని`. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాని నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించారు. ఇందులో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. వ‌రుణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ న‌టించిన ఈ సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, న‌దియా, న‌వీన్ చంద్ర ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

అమ్మ మంద‌లించింద‌ని తుంట‌రిప‌ని చేసి చిన్న‌ప్పుడే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు!

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప‌` డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుండ‌డం.. నేచుర‌ల్ స్టార్ నాని `శ్యామ్ సింగ రాయ్`తో పాటు `83` అనే బాలీవుడ్ మూవీ కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా డిసెంబ‌ర్ 24నే థియేట‌ర్స్ లోకి రానుండ‌డంతో `గ‌ని` టీమ్ రిలీజ్ డేట్ విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో.. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో `గ‌ని`ని విడుద‌ల చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వినిపిస్తోంది. అంతేకాదు.. అదే నెల‌కి ప్లాన్ చేసిన వ‌రుణ్ మ‌రో చిత్రం `ఎఫ్ 3` కూడా వేస‌వికి పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. త్వ‌ర‌లోనే `గ‌ని`, `ఎఫ్ 3` కొత్త రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com