హ్యాపీడేస్‌తో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకొచ్చాడు వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం కూడా హిట్టయిపోవంతో యువతరం ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఆ రెండు సినిమాలూ... 20 సినిమాల ఆఫర్లు తీసుకొచ్చాయి. అందులో ఒక్కటీ హిట్టవ్వలేదు. కొంతకాలంగా వరుణ్ హవా బాగా తగ్గింది. మొదలైన సినిమాలు కూడా ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు ఎప్పుడు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈలోగా వరుణ్ ప్రేమలో పడడం.. నిశ్చితార్థం జరిగిపోవడం చకచక అయిపోయాయి. పడ్డానండీ ప్రేమలో మరి అనే సినిమాలో తనకు జోడీగా నటించిన వితికాసేరుతో వరుణ్ వివాహం నిశ్చయమైంది. ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్సయ్యింది. ఈనెల 18న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరుణ్ - వితికల పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. 20వ తారీఖున హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. ప్రస్తుతం శుభలేఖలు పంచిపెట్టే పనిలో ఉన్నాడు వరుణ్ సందేశ్. పెళ్లయ్యాకైనా వరుణ్ సందేశ్ జాతకం మారుతుందేమో చూడాలి.




.jpg)

