Home

»

Latest News

నిహారిక కొత్త సినిమా... హీరో ఎవ‌రో తెలుసా??

Aug 8, 2016 4:32PM

 

నిహారిక ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకొన్నా... త‌న ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఒక మ‌న‌సు సినిమాతో ప్రేక్ష‌కుల్న చెడుగుడు ఆడేసుకొంది నిహారిక‌. ఆ సినిమా చూసి సాక్ష్యాత్తూ మెగా ఫ్యాన్సే.. త‌ల‌లు వేలాడేశారు. స‌మంత‌లా ఫాలోయింగ్ తెచ్చుకొంటుంద‌ని ఆశ ప‌డితే.. ఇదేంటి ఇలా జ‌రిగింద‌ని ఫీల‌య్యారు. అయితే.. నిహారిక‌కు మాత్రం అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఓ పంజాబీ థ్రిల్ల‌ర్ రీమేక్‌లో న‌టిస్తోంది నిహారిక‌. ఇప్పుడు మ‌రో సినిమాపై సంత‌కం చేసిన‌ట్టు తెలుస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో యూత్‌తో పాటు, ఇంటిల్లిపాదినీ బుట్ల‌లో వేసుకొన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు ఆ హీరోతోనే జ‌ట్టు క‌ట్ట‌బోతోంది. కార్తీక్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఆల్రెడీ స్ర్కిప్టు ప‌నులు పూర్త‌యిపోయాయి. త్వ‌ర‌లోనే ఈసినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ట‌. ఈ సినిమా కోసం నిహారిక కొత్త లుక్ ని ట్రై చేస్తోంద‌ట‌. ఫ‌స్ట్ సినిమాతో నిరాశ కి గురైన మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాతో కోలుకోవ‌డం ఖాయ‌మ‌ని నిహారిక భావిస్తోంది. మ‌రి ఏం జ‌రురుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com