Home

»

Latest News

అది "డిపార్ట్ మెంట్" కాదు "త్రిశంక్"- వర్మ

Mar 16, 2011 10:24PM

 varma stills, varma images, varma pics, varma photos, varma pictures, varma wallpapers అది "డిపార్ట్ మెంట్" కాదు "త్రిశంక్" అని రామ్ గోపాల వర్మ అన్నాడు. అంటే వర్మ తాను త్వరలో హిందీ, తెలుగు భాషల్లో తీయబోయే సినిమాకి ముందుగా "డిపార్ట్ మెంట్" అన్న పేరుని నిర్ణయించాడు. అదే మీడియాలో బాగా పాప్యులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమా పేరు "డిపార్ట్ మెంట్" కాదనీ దాని పేరు "త్రిశంక్" గా మార్చాననీ రామ్ గోపాల వర్మ అంటున్నాడు. ఇది పోలీస్ డిపార్ట్ మెంట్‍ మీద, పోలీస్ డిపార్ట్ మెంట్‍ లోని కష్టసుఖాలూ ఇలాంటి సమస్యల మీద వర్మ తీస్తున్న సినిమా ఈ "డిపార్ట్ మెంట్". ఈ చిత్రానికి "త్రిశంక్" అని మార్చటానికి కారణాలేంటనేదానికి వర్మ వివరణ చాలా బాగుంది.

త్రిశంకు అంటే త్రిశంకుడనేవాడిని విశ్వామిత్రుడు బొందితో స్వర్గానికి పంపటానికి ప్రయత్నించగా, అతన్ని స్వర్గానికి రానీయకుండా భూమి మీదకు తోసేస్తారు. విశ్వామిత్రుడు తలక్రిందలుగా కిందపడుతున్న త్రిశంకుణ్ణి ఆకాశంలో ఆపేసి అక్కడే ఒక కృత్రిమ స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. అలాగే పోలీసులు కూడా రాజకీయ నాయకులకూ, క్రిమినల్స్ కూ మధ్య త్రిశంకు లాగానే తలక్రిందలుగా వ్రేలాడుతుంటారు అన్న సందేశంతో ఈ చిత్రానికి "త్రిశంకు" అన్న పేరుని నిర్ణయించటం జరిగిందని వర్మ తెలియజేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com