
సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య, రంభ కాంబోలో వచ్చిన మూవీ 'అరుణాచలం'. తమిళంలో ఎంత విజయాన్ని అందుకుందో, తెలుగులో కూడా అంతే విజయాన్ని అందుకోవడం అరుణాచలం స్పెషాలిటీ. ఈ చిత్రంలో 'వేదవల్లి' అనే క్యారక్టర్ లో రజినీ ని ద్వేషించే బామ్మగా చేసి మెప్పించడంతో పాటు భయపెట్టింది కూడా.
ఈ సీనియర్ నటి ఇకలేరంటూ, తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్నాయి. ఈ వార్తలు చూసి దక్షిణ భారత సినీ ప్రపంచం, ఆమె అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే అసలు నిజమేంటో తెలియజేస్తూ, తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతు 'నేను పూర్తి ఆరోగ్యంతో, చాలా నిక్షేపంగా ఉన్నాను.. నన్ను బతికుండగానే చంపేశారు కదరా. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. అలాగే, ఈ తప్పుడు వార్తలు చూసి కంగారుపడి, నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఫోన్లు చేసిన శ్రేయోభిలాషులు, అభిమానుల ప్రేమాభిమానాలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏమాత్రం ఆధారాలు లేకుండా సెలబ్రిటీల ఆరోగ్యంపై, ప్రాణాలపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం చదవండి: బిగ్ బ్రేకింగ్: తమిళనాట మరో రాజకీయ పార్టీ ప్రసవం..తమిళగ మక్కల్ కళగం TMK

వడివుక్కరసి సినీ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. నటి కాకముందు ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన 'సిగప్పు రోజాక్కల్' చిత్రం ద్వారానటనా రంగంలోకి అడుగుపెట్టారు. సుదీర్ఘమైన ఈ సినీ ప్రయాణంలో 350కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ సీరియళ్లలో నటించి మెప్పించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విలన్, అమ్మ, నానమ్మ, నాయనమ్మ వంటి ఎన్నో పవర్‌ఫుల్ పాత్రలను పోషించారు.
రజనీకాంత్ తో పాటు, కమల్ హాసన్, శివాజీ గణేషన్ వంటి దిగ్గజాల చిత్రాలలో ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. రీసెంట్ గా 'కాన్ సిటీ' అనే చిత్రంలో యోగి బాబు తల్లిగా నటించి అలరించారు. వయసు పైబడినప్పటికీ, సరైన క్యారెక్టర్స్ వస్తే నటించడానికి ఇప్పటికి సిద్ధం.
మీకు నచ్చవచ్చు: ఎన్నేళ్లయినా చెక్కు చెదరని చలం పాట 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట'.!
[vadivukkarasi , Vadivukkarasi Death Rumours, Vadivukkarasi clarification, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





