Home

»

Latest News

సొంత వాళ్ళే మోసం: సీనియర్ నటి రాధ సంచలన కేసు.!

Sep 21, 2026 3:19PM

సీనియర్ నటి రాధ తన సోదరి, నటి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంచన్ నాయర్‌లపై రూ.46 కోట్ల విలువైన చెక్ మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

చెన్నై వలసరవాక్కంలోని తన ఇంట్లో వ్యాపార అవసరాల కోసం సంతకం చేసి ఉంచిన ఐదు ఖాళీ చెక్కులను తాను లేని సమయంలో తన సోదరి అంబిక, సోదరుడు దొంగిలించారని రాధ ఆరోపించారు.

ఐడీబీఐ బ్యాంక్ కరెంట్ అకౌంట్ నుండి రూ.46 కోట్ల భారీ మొత్తాన్ని అంబిక పేరుతో విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, రాధ మొబైల్‌కు వచ్చిన బ్యాంక్ అలర్ట్ మెసేజ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.!

మెసేజ్ చూసిన వెంటనే నటి రాధ అలర్ట్ అయి బ్యాంక్ ద్వారా 'స్టాప్ పేమెంట్' ఆదేశాలు ఇవ్వడంతో ఆ రూ.46 కోట్ల నగదు విత్‌డ్రా కాకుండా నిలిచిపోయింది. డబ్బులు పోనప్పటికీ, తన సొంత తోబుట్టువులే ఈ దగాకు ప్రయత్నించడంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు.

మీకు నచ్చవచ్చు: ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.. అమ్మాయి అందాన్ని ప్రకృతితో పోలుస్తూ వేటూరి చేసిన మ్యాజిక్.!

 

 

 

[Actress Radha Complaint, Actress Radha 46 Crore, Actress Radha Sister, Actress Radha Brother, Radha Police Complaint, Telugu Film News, Telugu News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com