Home

»

Latest News

రామ్ చరణ్ రచ్చలో గ్యాంగ్ లీడర్ పాట

Jun 7, 2011 11:09AM

రామ్ చరణ్ "రచ్చ"లో "గ్యాంగ్ లీడర్" పాట రీమిక్స్ చేస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలిం స్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" సినిమా ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సమయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం" రచ్చ". రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో గతంలో రామ్ చరణ్ తమడ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా "గ్యాంగ్ లీడర్" సినిమాలోని "వాన వాన వెల్లూవాయే" అనే పాటను రీమిక్స్ చేయనున్నారట.

"గ్యాంగ్ లీడర్" సినిమాలోని "వాన వాన వెల్లూవాయే" అనే పాటకు ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటంటే హీరో రామ్ చరణ్‍ కి కూడా చాలా ఇష్టం. ఈ విషయాన్ని రామ్ చరణ్ అనేక ఇంటర్వ్యూలలో సైతం తెలిపారు. ఈ పాటను "గ్యాంగ్ లీడర్" సినిమాలో చిరంజీవి, విజయశాంతిలపై వానలో చిత్రీకరించగా, రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో ఈ పాట రీమిక్స్ నురామ్ చరణ్, తమన్నా భాటియాలపై వానలోనే చిత్రీకరించనున్నారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com