
నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో 'డాకు మహారాజ్' సినిమాతో టాలీవుడ్‌లో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్‌తోనూ రచ్చ చేసిన ఈ భామ, ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో ఏకంగా ఒక ఏఐ (AI) కంపెనీ పైనే యుద్ధం ప్రకటించింది. ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ హాలీవుడ్ వేదికగా ఒక మైండ్ బ్లాకింగ్ లీగల్ నోటీస్ ఇచ్చింది.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కి చెందిన ఒక ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ, ఊర్వశి రౌతేలా యొక్క 'పర్సనాలిటీ రైట్స్'ని ఉల్లంఘించిందట. అంటే.. ఊర్వశి ముందస్తు అనుమతి గానీ, కనీస కాన్సెంట్ గానీ తీసుకోకుండా ఆమె పేరు, ఫొటోలు, విజువల్స్, వాయిస్‌ను.. తమ బిజినెస్ ప్రమోషన్ల కోసం, AI మోడల్స్ అభివృద్ధి కోసం వాడుకున్నారని ఊర్వశి లీగల్ టీమ్ ఆరోపిస్తోంది.
ఈ విషయంపై ఊర్వశి రౌతేలా టీమ్ చాలా ఘాటుగా స్పందించింది. "మీరు ఏఐ కంపెనీని అభివృద్ధి చేసుకోండి.. మీ బ్రాండ్ వాల్యూని పెంచుకోండి.. అంతేకానీ, పర్మిషన్ లేకుండా ఊర్వశి పేరుని, ఆమె ఇమేజ్‌ని మీ వ్యాపారంలోకి లాగితే చూస్తూ ఊరుకోం" అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతేకాదు, తమ పర్సనాలిటీ రైట్స్‌కి జరిగిన నష్టానికిగానూ ఏకంగా 7000 కోట్ల రూపాయల డ్యామేజెస్ పే చేయాలని ఆ AI కంపెనీని డిమాండ్ చేసింది.

అయితే, ఈ కేస్‌పై సదరు AI కంపెనీ CEO షీరాజ్ హసన్ కూడా వెంటనే కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. "అసలు టెక్నాలజీపై కనీస అవగాహన లేకుండా ఇలాంటి కోట్ల రూపాయల డిమాండ్లు చేయడం పూర్తిగా అర్థరహితం" అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
షీరాజ్ హసన్ మాట్లాడుతూ... "సినిమా ఇండస్ట్రీలో, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో AI అనేది భవిష్యత్తు. ముందుగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దాని ఉపయోగాల గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి. చనిపోయిన నటీనటులతో స్క్రీన్ మీద పెర్ఫార్మ్ చేయించడం నుంచి, ప్రపంచంలో ఏ భాషలోనైనా నేచురల్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పించడం వరకు.. మున్ముందు AI తో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. సాంకేతికత తీసుకొస్తున్న ఈ మార్పును ఇలాంటి నిరాధార వివాదాలతో ఎవరూ ఆపలేరు!" అని చాలా ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చేశారు.
ఇది కూడా చదవండి: 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.!
[Urvashi Rautela 7000 Crore Demand, Urvashi Rautela AI Lawsuit, Urvashi Rautela vs AI Company, Daku Maharaj Actress, Nandamuri Balakrishna, Urvashi Rautela, Telugu Film News]






