
"జీవితంలో మన కోసం మనం బతకాలి.. పక్కవారి కోసం కాదు" అని బండ్ల గణేష్ చెప్పిన ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన 'తెల్లకాగితం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ హత్తుకుంటోంది.
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ 'తెల్లకాగితం'. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత బండ్ల గణేష్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ ఈవెంట్‌లో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ సమయంలో తాను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
దర్శకుడు అలా బాధపడటం చూసిన బండ్ల గణేష్ వెంటనే స్పందించి ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. బండ్ల మాట్లాడుతూ.. "నీలాగా నేను బాధపడితే జీవితంలో 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి" అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను గుర్తుచేశారు. కష్టాలు అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలోనూ వస్తాయని, అంత మాత్రాన నిరాశపడిపోకూడదని హితవు పలికారు.
"పక్కవారి కోసం కాదు.. మన కోసం మనం ఆలోచించాలి. జీవితంలో ఎప్పుడూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకే నిరంతరం కష్టపడాలి" అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన సందేశం అక్కడ ఉన్న వారందరిలోనూ కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కష్ట సమయాల్లో గుండె నిబ్బరంతో ఎలా నిలబడాలో బండ్ల గణేష్ తనదైన మాటలతో చాలా స్పష్టంగా చెప్పారు.
ఇది కూడా చదవండి: అమితాబ్‌కు తీవ్ర గాయం.. అసలేం జరిగింది.. ఇప్పుడెలా ఉంది.?
[Bandla Ganesh Emotional Speech, Thella Kaagitham Pre Release Event, Bandla Ganesh Speech Viral, Thella Kaagitham Movie, Bandla Ganesh Speech, Thella Kaagitham, Bandla Ganesh, Telugu Film News]






