2022 కేరాఫ్ సీక్వెల్ మూవీస్!
on Jan 5, 2022

2022 క్యాలెండర్ ఇయర్.. పలు సీక్వెల్ మూవీస్ (వీటిలో కొన్ని సెకండ్ పార్ట్స్ కూడా ఉన్నాయి)కి కేరాఫ్ అడ్రస్ గా నిలువనుంది. సంక్రాంతి మొదలుకుని సంవత్సరాంతం వరకు ఈ తరహా చిత్రాలు తెలుగు తెరపై సందడి చేయనున్నాయి. వీటిలో పాన్ - ఇండియా మూవీస్ సైతం ఉండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ పొంగల్ కి `సోగ్గాడే చిన్ని నాయనా`(2016) సీక్వెల్ `బంగార్రాజు` రిలీజ్ కానుండగా.. ఏప్రిల్ 14న `కేజీఎఫ్` (2018) సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ ఛాప్టర్ 2` విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 29న `ఎఫ్ 2` (2019) సీక్వెల్ `ఎఫ్ 3` రాబోతుండగా.. ఏడాది చివరలో `పుష్ప - ద రైజ్` (2021) సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` సందడి చేయనుంది. అంతేకాదు.. `కార్తికేయ` (2014) సీక్వెల్ `కార్తికేయ 2`తో పాటు `హిట్` (2020) సీక్వెల్ `హిట్ 2`, `గూఢచారి` కొనసాగింపు సినిమా `గూఢచారి 2` కూడా ఇదే సంవత్సరం తెరపైకి వచ్చే అవకాశముంది. మొత్తమ్మీద.. 2022 సంవత్సరం పలు సీక్వెల్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలవనుందన్నమాట. మరి.. వీటిలో ఏయే చిత్రాలకు ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



