Home

»

Latest News

దురంధర్, రాజా సాబ్ సినిమాలతో పోటీ పడుతున్న 'అగ్లీ స్టోరీ'.!

Jul 18, 2026 12:27PM

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ నందు. ప్రస్తుతం ఆయన నటించిన సరికొత్త చిత్రం 'అగ్లీ స్టోరీ' ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇటీవల హాట్ స్టార్ లో విడుదలైన అగ్లీ స్టోరీ.. దురంధర్, ది రాజా సాబ్ సినిమాల తర్వాత అత్యధిక ఆదరణ పొందిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 

శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ ఏకంగా 8.1 మిలియన్ వ్యూస్ సాధించి టాప్‌లో నిలిచింది. తాజాగా హాట్ స్టార్ విడుదల చేసిన టాప్ 10 అత్యధిక వ్యూస్ చిత్రాల లిస్ట్ లో అగ్లీ స్టోరీ 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. 

కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన నటనతో మెప్పిస్తున్న శ్రీ నందుకు ఈ సినిమా విజయం ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్‌ని ఇస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో శ్రీ నందు నటన చాలా అద్భుతం అని విశ్లేషకులు కొనియాడారు. తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. 

 

 

Ugly Story, Nandu, Avika Gor, Telugu Cinema

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com