
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని ఈ సారి పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' తో పాన్ ఇండియా స్థాయిలో తన 'విజయ దుంధిబిని చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కి ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న సదరు న్యూస్ అభిమానులని, మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం నైజాం ఏరియా థియేట్రికల్ హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ 37 కోట్ల భారీ రికార్డు ధరకి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ,సరికొత్త రికార్డు స్థాయి థియేట్రికల్ డీల్ కావడం విశేషం. సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ రేంజ్‌లో మార్కెట్ జరగడం నాని బాక్సాఫీస్ స్టామినాని కూడా నిరూపిస్తోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
1960ల నాటి గ్యాంగ్‌స్టర్ పీరియడ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథలో నాని మునుపెన్నడూ చూడని అత్యంత ఊర మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. నానికి జోడీగా కయదు లోహర్ నటిస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు షికంజి మాలిక్‌గా మరియు బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ విక్రమ్ మాలిక్ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ నుంచి వచ్చిన 'ఆయా షేర్' సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా డిజిటల్ హక్కుల విషయంలో కూడా సరికొత్త రికార్డు నమోదైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 58 కోట్ల భారీ ధర వెచ్చించి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
also read: వైరల్ గా మారిన అన్నా కొణిదెల తాజా న్యూస్.. అభిమానులు హర్షాతిరేకాలు
భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది. ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న ఈ కళ్ళు చెదిరే బిజినెస్ చూస్తుంటే, 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.
kayadu lohar, nani, srikanth odela, mythri movie makers





